రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్‌’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.