హైదరాబాద్‌: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో ప్రతీ ఇంటా జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, తెలంగాణ త్రివర్ణ శోభితమైంది. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. తెలంగాణ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో తుర్రేబాజ్‌ఖాన్‌, రాంజీగోండు, పీవీ సహా అనేక మ​ంది పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే అన్ని రంగాల్లో ముందుంది. హైదరాబాద్‌ను గంగాజమునా తెహజిబ్‌గా మహాత్మాగాంధీ అభివర్ణించారని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.