స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం…….జెండా ఎగరేస్తుండగా ఇద్దరు మృతి తెలంగాణలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశమంతట వజ్రోత్సవ సంబరాలు చేసుకుంటున్న వేళ పటాన్చెరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగురవేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరు మృతిచెందారు. అంతేకాకుండా మరొకరికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఆనంద్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఎగర వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అనిల్ గౌడ్ (45) తిరుపతయ్య (48) అనే వ్యక్తులు మృతి చెందారు.అంతేకాకుండా ధనుంజయ అనే వ్యక్తి గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఆసుపత్రిని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ సమయంలో పటాన్చెరు మండలం ఇంద్రేశంలో ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.