సంచలన నిర్ణయం తీసుకున్న నటి మీనా

సినీ నటి మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తన భర్తను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న మీన తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఇపుడు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తన అవయవాలను దానం చేయనున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. “ఈ ప్రపంచంలో ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కంటే ఉన్నతమైనది మరొకటి లేదని భావిస్తున్నాను. అవయవదానం అనేది ఒక మనిషి ప్రాణాలు కాపాడే అత్యున్నత మార్గం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో భాధపడేవారికి ఇది ఒక పునర్జన్మ వంటిది. దీన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించాను. నా భర్తకు ఒక్క అవయవదానం చేసే దాత లభించివుంటే నా జీవితం మరోలా ఉండేది. అందువల్ల అవయవదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను” అని ఆమె అందులో పేర్కొన్నారు…!!

By admin

Leave a Reply

Your email address will not be published.