విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకుని.. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఇంటికి చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులైన సూర్య, రాశి దంపతులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని గన్నవరం బయల్దేరారు.

సీఎం జగన్‌ ఇంటికి రావడంతో మా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రిసెప్షన్‌కు సీఎం రాలేకపోయారు. సీఎం రాలేకపోతున్న విషయాన్ని నాకు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. మత్స్యకారుడైన నా ఇంటికి సీఎం జగన్‌ రావడం చాలా సంతోషం. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. ఈ రోజును మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.