హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్‌ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా క్రియేట్‌ చేశారు. కొండా సురేఖ తదితరుల పేర్లను కావాలనే ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఆ తర్వాత అసలు దరఖాస్తే చేసకోని స్థానికేతరుడు, తనకు నచ్చిన బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి హుజూరాబాద్‌లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్నది. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా కాంగ్రెస్‌లో బలంగానే ఉన్నారు. వాళ్లందర్నీ కాదని స్థానికేతురుడైన వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తంచేశారు. ఏ విధంగానైనా ఈటలను గెలిపించాలనే తపనతోనే రేవంత్‌రెడ్డి ఇలాంటి రాజకీయం చేశారని మండిపడుతున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published.