కుప్పం: రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. ఏళ్ల తరబడి పాలించిన టీడీపీ నేతలు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడికక్కడ సమస్యలు తాండవిస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల తో స్థానికులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. ప్రధానంగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతోనే అభివృద్ధికి తొలి అడుగు పడింది. తాజాగా మున్సిపాలిటీ అభివృద్ధికి ము ఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.66 కోట్ల నిధులు విడుదల చేయడంతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. ప్రస్తుతం డికే పల్లి చెరువు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. అయితే మున్సిపాలిటీ పరిధి పెరగడంతో అన్ని ప్రాంతాలకు పూర్థిస్థాయిలో నీరు అందని పరిస్థితి. ప్రస్తు తం తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.3.67 కోట్లతో నూతన బోర్లు, పైపులైన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రు. అనిమిగానిపల్లె, తంబిగానిపల్లె, పరమసమద్రం, చీగలపల్లె, కమతమూరు గ్రామాల్లో నూతన బోర్ల డ్రిల్లింగ్‌తో పాటు ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.