న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్‌ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్‌ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే  బైక్‌ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి  ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు.

ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది.  ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి  కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.