హైదరాబాద్‌: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్‌ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.