హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఎస్సార్‌డీపీ ద్వారా వివిధ ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌ కారిడార్లు, అండర్‌పాస్‌లు వంటి సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణానికి ప్రాధాన్య
మిచ్చిన జీహెచ్‌ఎంసీ.. ఇక జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ తదితర పనులపై దృష్టి సారించింది. రూ.వేల కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మించి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించినప్పటికీ, పలు జంక్షన్లు చూపరులను ఆకట్టుకునేలా లేవు. కొన్ని మాత్రం వివిథ థీమ్‌లతో, ఆయా ప్రాంతాల్లో సుపరిచితమైన విగ్రహాలు వంటి వాటితో  ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో తగిన విధంగా లేవు.

By admin

Leave a Reply

Your email address will not be published.