ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ)తో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్టు సమావేశం నిర్వహించగా..పలు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులపై రూ.2,868.6 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. ప్రాజెక్టుల ద్వారా ఐదేళ్లలో 1,564 గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసువస్తామని తెలిపారు.

ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.. విశాఖ, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో రిసార్టుల నిర్మాణానికి సమావేశంలో ఆమోదం లభించింది. పర్యాటక రంగానికి చిరునామాగా ఏపీ మారాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు ఉండాలని, అత్యాధునిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని జగన్‌ అన్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.