చిత్తూరు: ఎన్నిక‌ల మేనిఫెస్టోనే కరదీపికగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన సాగిస్తున్నార‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు.  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు ఆర్కే రోజా  నగరి మున్సిపాలిటీ ప‌రిధిలోని 3వ వార్డు లో ప‌ర్య‌టించారు. కశింమిట్ట సచివాలయం పరిధి లో మంత్రి ఆర్కే రోజా  గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం చేప‌ట్టారు.  ప్ర‌తి ఇంటికి వెళ్లి  ఈ మూడేళ్ల‌లో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో భాగంగా తమ ఇంటికి విచ్చేసిన మంత్రికి ప్రజలు  సాదరంగా ఆహ్వానించి ఆప్యాయం గా పలకరించారు.  జగనన్న ఇస్తున్న ప్రభుత్వ పథకాల వలన కలుగుతున్న లబ్దిని వారే స్వయంగా చెప్పారు. స్థానికంగా మాకు అందుబాటులో ఉండి మాకు అండగా ఉన్న రోజమ్మ  కూడా చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ప్రభుత్వం అందించే 32 రకాల సంక్షేమ పథకాలను గూర్చి ప్రతి గడప లో మంత్రి  స్పష్టంగా తెలిపారు.గతం ప్రభుత్వం లో లా కాకుండా ఇప్పుడు పారదర్శకంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు మరి యు అభివృధి పనులను గురించి వివరించారు. కార్యక్రమం లో నగరి మున్సిపాలిటీ  చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇతర ముఖ్య పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు

By admin

Leave a Reply

Your email address will not be published.