వై.ఎస్.ఆర్ జిల్లా..

👉 జిల్లా లోని కొండాపురం సర్కిల్ పరిధిలోని కలమల్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలను పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎస్.ఐ శివప్రసాద్ ను ఆదేశించారు.

👉 పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు..

👉 అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు…

👉 దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, నిషేధిత గుట్కా పై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

👉 మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

👉 రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కొండాపురం సి.ఐ సుదర్శన్ ప్రసాద్, కలమల్ల ఎస్.ఐ శివప్రసాద్ కు సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.