వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు.
ఆచూకీ తెలిపిన వారికి ఐదువేల రూపాయల బహుమానం ప్రకటించిన పోలీసులు.
జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామానికి చెందిన జక్కే శ్రీనివాసరావు (శ్రీరామ్) రామవరం గ్రామం నుంచి బయటకు వెళ్లి కనిపించడంలేదని వాట్సప్, సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సిఐ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ ఆచూకీ తెలిసిన వారు పెద్దాపురం ఇన్ఛార్జి డి.ఎస్.పి సుంకర మురళీమోహన్ 94407 96508, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు 94407 96529 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.శ్రీరామ్ ఆచూకీ తెలిపిన వారికి 5వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.