తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. కేంద్ర మాజీమంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ డిసెంబర్‌లో పార్టీలో పెట్టబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులతో వినయ్ కుమార్ భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును ప్రటిస్తానని వినయ్‌కుమార్ అన్నారు. తన స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన వినయ్ కుమార్.. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే ఆ తరువాత ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఉన్నట్టుండి ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక కొంతకాలంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు, శక్తులు పుట్టుకొస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ఆర్ కూతురు షర్మిల వైఎస్ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఏడాదిపాటు తన పాదయాత్ర కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. ఇక మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. దళితులను తన వైపు తిప్పుకోవాలని.. బహుజనుల ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇక కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి పార్టీ రాజకీయంగా ఉనికి కోసం పోరాడుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఆయన మాత్రం ప్రభావం చూపులేకపోతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.