తాడేప‌ల్లి: విధినిర్వహణలో వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్‌ అన్నమయ్య జిల్లా దేవపట్టకు చెందిన డి. రాజశేఖర్‌ అతని సహచరుల మృతి పట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

కశ్మీర్‌ లోయలో బస్సు పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన  జవాన్‌ దేవరింటి రాజశేఖర్‌ (35) మృతి చెందినట్లు బంధువులకు సమాచారం అందింది. బద్రీనాథ్‌ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బస్సుకు మంగళవారం ప్రమాదం జరిగి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో జవాన్‌ రాజశేఖర్‌ మృతి చెందినట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. డి.చిన్నయ్య, రాములమ్మల పెద్దకుమారుడు అయిన రాజశేఖర్‌ ఐటీబీపీలో 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రాజశేఖర్‌కు భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.