అక్కినేని నాగ చైతన్య మరియు టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం… వీరు సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టినా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సమంతా పై కొన్ని యూట్యూబ్ ఛానల్లు కూడా పిచ్చి రాతలు రాస్తున్నాయి.

అయితే వీటిపై ఇటీవల సమంత కోర్టుకు వెళ్లగా… తాజాగా మరో పోస్టు చేసింది సమంత. పెళ్లి పై ఓ ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేసింది హీరోయిన్ సమంత. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకుని నిలబడగలిగే ఆడపిల్లల్ని పెంచాలంటూ… భారత హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్ ను సమంత షేర్ చేసింది.

” మీ కుమార్తె ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ? అని చింతించ కుండా ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. పెళ్లి కోసం డబ్బు దాచి పెట్టే బదులు ఆమె చదువు పై ఖర్చు పెట్టండి. తన కాళ్ళపై తాను నిలబడగలిగేలా చేయండి. ” అంటూ రాంపాల్ షేర్ చేసింది. అయితే ఆ పోస్ట్ ను హీరోయిన్ సమంత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో… క్షణాల్లో సమంత పోస్టు వైరల్ గా మారింది. నాగచైతన్య ను ఉద్దేశించి ఈ పోస్టు సమంత చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.