అమరావతి: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తామని, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఆయన గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విధానంలో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. పీహెచ్‌సీలోని ప్రతి వైద్యుడు రోజు మార్చి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో వెళ్లి గ్రామాల్లో వైద్య సేవలందిస్తారని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.