రాముల‌మ్మ‌కు కోప‌మొచ్చింది. బీజేపీలో విజ‌య‌శాంతి సెకండ్ ఇనింగ్స్ సాఫీగా సాగ‌డం లేదా ? బ‌హిరంగంగా అసంతృప్తి వెళ్ల‌గ‌క్క‌డం వెన‌క కార‌ణాలేంటీ ?  తెర వెనుక ఎవ‌రైనా ఉన్నారా ? అస‌లు విజ‌య‌శాంతి ఆగ్ర‌హానికి కార‌ణ‌మేంటి ?

విజ‌య‌శాంతి…ఫైర్ బ్రాండ్‌… మెద‌క్ మాజీ ఎంపీగా తెలంగాణ ఉద్య‌మ‌కారురాలిగా సుప‌రిచితులు. గ‌తంలో బీజేపీ అగ్ర‌నేత అద్వానీకి ద‌గ్గ‌ర‌గా ఉండి ర‌థ‌యాత్రలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ ప‌క్క‌నే ఉన్నారు. త‌ల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆమెనే సార‌థ్యం వ‌హించారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. బీజేపీలో చేరిన త‌ర్వాత‌… ఆ స్థాయిలో ఆమెకు ప్రాధాన్య‌త దక్క‌డం లేద‌ని ఆమె మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ట‌.

By admin

Leave a Reply

Your email address will not be published.