హైదరాబాద్‌: నగరంలో అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్తత నెలకొంది.

వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌, మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.