మనం చాలా కాలం పాటు జట్టుకు దూరమైతే.. ఇతరులు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. ఒకవేళ వాళ్లు మెరుగ్గా రాణించినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. ఒకవేళ మనం మళ్లీ టీమ్‌లోకి తిరిగి రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చినపుడు కచ్చితంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. వాటిని ఎలా అందుకోవాలన్న అంశం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. మిగతా విషయాల్లో నేనేమీ చేయలేను’’ అని టీమిండియా పేసర్‌ దీపక్‌ చహర్‌ అన్నాడు.

అదిరిపోయే రీఎంట్రీ!
గాయాల కారణంగా దీపక్‌ చహర్‌ దాదాపు ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ సాధించిన అతడు జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. ఇందులో భాగంగా హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) జరిగిన మొదటి వన్డేలో ఆడిన చహర్‌.. 7 ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా ఆతిథ్య జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసి.. ఆపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు చహర్‌. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన చహర్‌కు ఆసియా కప్‌-2022కు ప్రకటించిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. 30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు సెలక్టర్లు.

By admin

Leave a Reply

Your email address will not be published.