తణుకు : ఆ ఫోరెనిక్స్‌ రిపోర్టు తాను ఇచ్చింది కాదని అమెరికాలోని ల్యాబ్‌కు చెందిన జిమ్‌ స్టాఫర్డ్‌ స్వయంగా స్పష్టం చేయడంతో టీడీపీ కుట్ర బట్టబయలైందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రిపోర్టును మార్చడానికి ఆయన సమ్మతించక పోవడంతో ఏకంగా సర్టిఫికెట్‌నే మార్చడం టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తనను ఇబ్బంది పెట్టారని ఏ మహిళా.. ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ఒక మార్ఫింగ్‌ వీడియోతో చంద్రబాబు అండ్‌ కో నీచ రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. సాంకేతికతను ఉపయోగించుకుని కుట్రలకు తెరతీయడంలో దిట్ట అయిన చంద్రబాబు, లోకేశ్‌ గ్యాంగ్‌ ఎంతటి నీచానికైనా ఒడిగడతారని మండిపడ్డారు. తప్పుడు రిపోర్ట్‌తో దొరికిపోయిన బాబు అండ్‌ గ్యాంగ్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వీడియో చూశామని టీడీపీకి చెందిన కొందరు మహిళలు సభ్యత మరచి.. అడ్డగోలుగా మాట్లాడుతుండడం పట్ల సభ్య సమాజం తల దించుకుంటోందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న లోకేశ్‌ చిత్రాలు చూసి కూడా ఏమీ మాట్లాడని చంద్రబాబు అండ్‌ కోను ఏమనుకోవాలని నిలదీశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ను మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.