అనకాపల్లి : ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాలపై ఇస్తున్న రాయితీలను పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేక సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాయితీల వల్ల చిన్న, సన్నకారు రైతులు, మెట్ట భూముల రైతులు లబ్ధి పొందుతారన్నారు. గతంలో సరఫరా చేసిన కంపెనీలకు బకాయిలు చెల్లించి, కొత్తగా నమోదు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకరరావు, భద్రం, కోన లక్ష్మణ, రాజాన దొరబాబు, నాగేశ్వరరావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.