పాడేరు : అరకు కాఫీ జాతీయ స్థాయి వేదికపై మరోసారి అదుర్స్‌ అనిపించింది. ప్రతిష్టాత్మక సదస్సులో ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాటింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో–సోషల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కోల్‌కతాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.