శ్రీ‌కాకుళం: నిజాయితీ..నిబ‌ద్ధ‌త అన్న‌వే మా ప్ర‌భుత్వానికి ప్రామాణికాలని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాదరావు అన్నారు. గార‌ మండ‌లంలో త‌హ‌శీల్దార్, ఎంపిడివో కార్యాలయాలను రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..”ఓ కార్యాల‌యం విసుగు క‌లిగించే విధంగా ఉంటే మ‌న‌సు పెట్టి చేయ‌డం సాధ్యం కాదు కానీ వ‌స‌తులు ఉంటే మ‌న‌సు పెట్టి చేయాల‌ని అనిపిస్తుంది. ఇక్క‌డి కార్యాల‌య భ‌వ‌న నిర్మాణపు ప‌నుల‌కు టీడీపీ హ‌యాంలో శంకుస్థాప‌న చేశారు.. వైయ‌స్ఆర్‌ సీపీ హయాంలో పూర్తైంది. మంచి పాల‌న అంటే మంచి మార్పులో ఉంది. పరిపాల‌న‌ను వికేంద్రీక‌రించాల‌న్న ఆలోచ‌న  ఉంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప‌రిపాల‌న తీసుకుని రావాల‌ని చాలా వ‌ర‌కూ కృషి చేశారు. కొద్దో గొప్పో జ‌రిగింది. కానీ వైసీపీ హ‌యాంలో ప‌రిపాల‌న‌ను కింది స్థాయికి చేర్చ‌డం జ‌రిగింది. పంచాయ‌తీ స్థాయికి ఓ కార్యాల‌యాన్ని తీసుకుని వ‌చ్చిన ఘ‌న‌త వైయ‌స్సార్ దే. మండ‌ల కార్యాల‌యానికి, త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి ఇది వ‌ర‌కులా రావ‌డం లేదు. నా ద‌గ్గ‌ర‌కు కూడా ఇదివ‌ర‌క‌టిలా వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గిపోయింది. ఇదంతా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల సాధ్యం అయింది. అర్హ‌త నిర్ణ‌యించిన త‌రువాత ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు చేరే విధంగా చేసే ప్ర‌క్రియ స‌జావుగా సాగిపోతోంది.”

By admin

Leave a Reply

Your email address will not be published.