ఒంగోలు అర్బన్‌: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్‌ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published.