నిర్మల్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సురేష్‌ హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి సురేష్‌ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, మృతుడు ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ప్రేమవ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.