జివిఎంసి 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత ఆధ్వర్యంలో ఆసరా ర్యాలీని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆరిలోవ కాలనీ దుర్గాబజార్ నుంచి ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు డ్వాక్రా సంఘం మహిళలు, ఆర్పిలతో ఈ ప్రదర్శన సాగింది. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా ఆసరా పథకానికి అర్హులైన మహిళలకు రుణాలు మంజూరు చేశారన్నారు. దీంతో మహిళల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో నిరూపణ అయిందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, ఎఇ అప్పాజీ, వైసిపి సీనియర్ నాయకులు అక్కరమాని వెంకటరావు, కెల్ల సత్యనారాయణ, బేత దుర్గారావు, శిరీషా తదితరులు పాల్గొన్నారు.