జనగామ: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్‌ పాదయాత్రలో​ బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి ఉద్రిక్తతకు దారితీయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక, లాఠీఛార్జ్‌ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published.