ముస్తాబాద్‌ (సిరిసిల్ల):‘సార్‌ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతు­న్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతు­న్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కా­డు

రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్‌ (8) అంబేడ్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతు­న్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్‌ఐ భరత్‌ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బాలకిషన్‌కు తెలిసిన డ్రైవింగ్‌ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.