టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత బౌలర్లతో ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నాడు హిట్‌మ్యాన్‌. యజువేంద్ర చహల్‌, రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్ల బౌలింగ్‌లో తనదైన షాట్లతో అలరించాడు. సిక్సర్లు, ఫోర్లు బాదాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లి రంగంలోకి దిగాడు. భారీ షాట్లతో సొంత జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి ప్రాక్టీసుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.