విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. సముద్రాన్ని కాపాడుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశులను హరించివేస్తున్నాయి. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ‌ బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు చేప‌ట్టి తీరం వెంట ఉన్న ప్లాస్టిక్‌ను తొల‌గించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రసంగించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.