విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదువుకోవాలి.. చదువుతోనే ∙పేదరికం నుంచి బయటపడగలం అన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా మన పిల్లలు కరికుళం ఏం చదువుతున్నారు. ఆ కరికుళం జాబ్‌ ఓరియంటెడ్‌గా ఉందా.. లేదా..? అని చూసి మార్పులు తీసుకురావాలనే తపన, తాపత్రయంతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ ఆలోచన చేసి అడుగులు ముందుకువేస్తున్న పరిస్థితి మొట్టమొదటి సారిగా ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందన్నారు. విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో మైక్రోసాఫ్ట్‌ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
‘‘ఆంధ్రరాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు కాలేజీల్లో అడ్మీషన్‌ తీసుకుంటున్నారని గమనిస్తే.. బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ అమెరికా) దేశాలతో కంప్యార్‌ చేసినప్పుడు విచిత్రమైన నంబర్లు కనిపిస్తాయి. మన భారతదేశంలో ఆ నంబర్లు 26, 27 శాతం మాత్రమే నమోదవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మిగిలిన వారు ఎందుకు చదువుకోవడం లేదు.. ఎందుకు కాలేజీల్లో చేరడం లేదని గమనిస్తే.. కారణం ఏంటంటే.. ఆర్థిక ఇబ్బందులతో చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రతీ అంశాన్ని బూతద్దంలో చూసి.. వాటిని అధిగమించడానికి ప్రతీ అడుగుపడుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.