న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్‌ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయానికి రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి అనుమతులు రానున్నాయన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ప్రధాని నియమించిన కమిటీ సమావేశం గురువారం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్‌ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌ ప్రకాశ్, హిమాన్షు కౌశిక్, రమణారెడ్డి హాజరయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published.