మహారాష్ట్రలో పాల్ఘర్‌ జిల్లాలోని వాసాయిలో 15 ఏళ్ల బాలిక మృతదేహంతో కూడిన బ్యాగ్‌ని గుర్తించారు పోలీసులు. ఆ బ్యాగ్‌ ముంబై అహ్మదాబాద్‌ హైవే పక్కనే ఉన్న నైగావ్‌ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలన సమయంలో కనుగొన్నారు. ఒక బాటసారి ఈ బ్యాగ్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో వాలివ్‌ పోలిస్టేషన్‌ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఐతే మృతదేహం పై పలు చోట్ల కత్తిపోట్టు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితురాలు ముంబైలోని అంధేరి ప్రాంతాని చెందిన వాసిగా పేర్కొన్నారు. అదీగాక అంధేరి పోలీస్టేషన్‌లో ఒక కిడ్నాప్‌ కేసు నమోదైనట్లు గుర్తించామని చెప్పారు.

దీంతో తాము ఈ కేసును మర్డర్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బాధితురాలి కుటుంబికులు కూడా ఆమె స్కూల్‌కి వెళ్లిందని పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసుతెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.