తాడేపల్లి: చంద్రబాబే ఆరిపోయే దీప‌మ‌ని, అందుకే ఆ అరుపులు అరుస్తున్నార‌ని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆ విధంగా ఏదో గందరగోళం చేసి, ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అట. ఎవరు ఆరిపోతున్నారయ్యా? ఎవరికి వెలుగు ఎక్కువ ఉంది? ఈ డైలాగ్‌ బాగా అర్ధం చేసుకోవాలి. కుప్పంలో ఇంకా ఏమంటున్నాడు? రా జగన్‌మోహన్‌రెడ్డి, రా రాజేందర్‌రెడ్డి, రా ఎస్పీ. అందరూ కుప్పం వెళ్తే అక్కడ తేల్చుకుంటాడా? అది కదా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే. ఆ అరుపులు. కేకలు. ఆ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడూ లేనటువంటి భాష. ఎస్పీ నీ ఇంటి మీదకు వస్తా అన్నాడు. ఏమిటా మాటలు. పోలీసులపైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినంత ఈజీ కాదు. అధికారుల మీదకు వెళ్లడం. 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు, కుప్పంకు తరలిపోయి, అక్కడి నుంచి ఏడుసార్లు గెల్చి, ఎన్ని పదవులు చేపట్టినా, ఆ నియోజకవర్గానికి గత 33 ఏళ్లుగా ఒక్క పనీ చేయలేదు. అయితే ఈమధ్య పదే పదే కుప్పంకు వెళ్తున్నారు. కుప్పం మీద ప్రేమ ఎక్కువైందో లేక భయపడుతున్నారో తెలియదు. ఆయనకు ప్రేమ ఉండదు. అక్కడ తనకు ఓటమి తప్పదన్న భయం పట్టుకుంది కాబట్టే, పదే పదే అక్కడికి వెళ్లి, ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఈసారి కూడా కుప్పంలో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.