పెనుకొండ: రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంద‌ని, అందుకే జనమంతా వైయ‌స్‌ జగన్‌ వెంట నడుస్తున్నార‌ని ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అండగా నిలుస్తూ అపూర్వ విజయాన్ని అందిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయార‌న్నారు. చివరకు తన సొంత నియోజకవర్గం ‘కుప్పం’లోనూ ఉనికి కోల్పోవడంతో రోడ్డుపై కూర్చుని ‘డ్రామా’కు తెరతీశార‌ని మండిప‌డ్డారు. సోమందేపల్లిలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అర్హత ఉంటే చాలు పథకం ఇంటికే నడిచి వస్తోందని, అందువల్లే ‘కుప్పం’ ప్రజలూ వైయ‌స్సార్‌ సీపీ వెంట నడుస్తున్నారన్నారు. ఈక్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైయ‌స్ఆర్‌ సీపీకి పట్టం కట్టారన్నారు. దీంతో చంద్రబాబుకు మతి భ్ర‌మించింద‌న్నారు.

టీడీపీ కేడర్‌ కూడా వైయ‌స్సార్‌ సీపీలో చేరుతోండటంతో ఏం చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. టీడీపీ నేతలే అక్కడున్న వైయ‌స్సార్‌ సీపీ నేతల ఫ్లెక్సీలు చించి నానా హంగామా చేస్తే వైయ‌స్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారని, దీంతో టీడీపీ నేతలే దాడి దిగారన్నారు. కానీ చంద్రబాబు, అతని అనుచరులు కుప్పంలో వైయ‌స్సార్‌ సీపీ శ్రేణులే…టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.