తాడేప‌ల్లి: వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా .. ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నార‌ని వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇవి పూర్తిగా అసత్యాలు. ఈ గాడిదలు, వెధవలకు రాజకీయం చేయడానికి ఏ విషయం లేకపోవడంతో ఆఖరికి వినాయకుడి పండుగనూ రాజకీయం చేస్తున్నారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర తగ్గించింది మా ప్రభుత్వమే
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో వినాయక చవితి మండపాలకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించి 500 మెగావాట్‌ లోడు వరకూ వెయ్యి రూపాయలు వసూలు చేశారు. దానికి ఇదిగో డాక్యుమెంట్ ఎవిడెన్స్. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. అదే, మేము అధికారంలోకి వచ్చాక వినాయక చవితి పందిళ్ల విషయంలో ఆ స్లాబ్‌ను తగ్గించి … వెయ్యి రూపాయిలను రూ. 500 చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వానిదే. మరోసారి చెబుతున్నాం… మేము అధికారంలోకి వచ్చాకే వినాయక మండపాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాం. అప్పుడైనా, ఇప్పుడైనా 9 రోజుల మైక్ పర్మిషన్ కు వెయ్యి రూపాయలే. వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ- బీజేపీ వాళ్లు ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.