ఆస్ట్రేలియా: దేశం గర్వపడేలా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఆస్ట్రేలియాలో వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నారైల సమావేశంలో మంత్రి రోజా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆర్ కే రోజా మాట్లాడుతూ.. నవరత్న పథకాలతో ప్రతి పేదవాని ఇంట నేడు వెలుగులు విరజిమ్ముతోందని ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి, నాయకుడంటే ఇలా ఉండాలని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నిరూపించారు అన్నారు.

పేగు పంచిన విజయమ్మ, రక్తం పంచిన రాజన్న, పురుడు పోసిన పులివెందుల, పట్టం కట్టిన ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా జగనన్న పాలిస్తున్నారు అన్నారు. దేశం కోసం యుద్ధం చేస్తే అతను సైనికుడు అని, ధర్మం కోసం యుద్ధం చేస్తే అతను రాముడని, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే అతను నాయకుడని, అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. తాను ప్రవేశపెట్టిన అర్హులైన అందరికీ అవుతుందా అని తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. దీంతో పేద ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతోందన్నారు. దేశీ చదువులతో పాటు విదేశీ చదువులకు కూడా విదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగనన్న అన్నారు. ఆయనతోపాటు ఆయన స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.