అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని-5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని-5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని-5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సిద్ధం చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.