ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్‌ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం….పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్‌ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది.

దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా…. చనిపోయిన ట్రాన్స్‌ జెండర్‌ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్‌ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌ జోయాతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేసినట్లు తెలిపాడు.

ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్‌ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.