దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్‌ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది.

ఈ విషయంపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్‌ఘర్‌ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.