హైదరాబాద్‌: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభ‌వించిన‌ప్పుడు భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు  సందీప్‌, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన  ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్‌ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్‌ లీక్‌ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్‌ లీక్‌ కావడంతో రూమ్‌ అంతా గ్యాస్‌ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్‌ వెలిగించడంతో సిలిండర్‌ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.