హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీతో ఇవి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌ను నవంబరు 6 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల అధికారులకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 13 కేంద్రాల్లో రెండు దశల్లో ఈ స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించనున్నారు. మొదటి దశను నవంబరు 6 నుంచి, రెండో దశను 8 నుంచి చేపడతారు.

By admin

Leave a Reply

Your email address will not be published.