వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగిసింది. శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మొదటిరోజు గురువారం.. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్‌ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రారంభించారు. సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాలలో కలియదిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్‌ అరగంటకు పైగా గడిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.