శ్రీ‌కాకుళం: హుద్ హుద్ తుపాను బాధితుల‌కు రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేశారు. స్థానిక క్యాంప్ ఆఫీసులో కుందువాని పేటకు చెందిన 72 మంది లబ్ధిదారులకు వీటిని అందించారు. ఇళ్లు లేని వారికి ప్రాధాన్యం ఇస్తూ వీటిని అందిస్తామ‌ని మంత్రి ధర్మాన తెలిపారు. ఇప్ప‌టికీ ఇళ్లే లేని పేద‌లు ఉన్నార‌ని, వారిని ఆదుకున్నామ‌ని, ఇప్ప‌టికే ముప్పై ల‌క్ష‌ల మందికి స్థ‌లాలు ఇచ్చాం అని తెలిపారు. అందులో ప‌దిహేను ల‌క్ష‌ల ఇళ్లను కింద‌టి సారి మంజూరు చేశామ‌ని, ఈ సారి మ‌రో ప‌దిహేను ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేస్తాం అని వివ‌రించారు. అదేవిధంగా పేద‌ల‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు త‌మ ప్ర‌భుత్వం నిత్యం కృషి చేస్తుంద‌న్నారు. అదేవిధంగా బ‌డి ఈడు పిల్ల‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా బడికి పంపేందుకు, పేదరికం రీత్యా చ‌దువులు మ‌ధ్య‌లోనే ఆపేయ‌కుండా ఉండేందుకు త‌ల్లుల అకౌంట్ల‌లోకి ప‌దిహేను రూపాయ‌లు అమ్మ ఒడి పేరిట అందిస్తున్నామ‌ని చెప్పారు. అదేవిధంగా పిల్ల‌ల‌కు పుస్త‌కాలు., స్కూల్ బ్యాగ్, షూస్ తో పాటు వాళ్ల‌కు మంచి గా బోధించేందుకు మంచి సౌక‌ర్యాల‌తో త‌ర‌గ‌తి గ‌దులు ఇలా అన్నీ క‌ల్పించి, భావి త‌రాల‌ను ఉన్న‌త పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. అదేవిధంగా అంగ‌న్ వాడీలు మొదలుకుని మ‌త్స్య‌కారుల వ‌ర‌కూ త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌నూ ఆదుకుంటుంద‌ని వెల్ల‌డించారు. అవినీతి ర‌హిత పాల‌న అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తున్నామ‌ని, ఇదంతా మార్పేన‌ని, ఇదంతా త‌మ వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యం అని అన్నారు. ధ‌ర‌ల విష‌య‌మై విప‌క్షాల విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. పొరుగు, ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చి ధ‌ర‌ల విష‌య‌మై మాట్లాడాల‌ని, అస‌త్య ప్రచారం చేసి అపోహ‌లు సృష్టించేవారిని న‌మ్మ‌వ‌ద్ద‌ని హిత‌వు చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మంటించ‌కుండా నిత్యావ‌స‌ర స‌ర‌కులు అందించామ‌ని గుర్తు చేశారు. బుడ‌గ‌ట్లపాలెంలో ఫిషింగ్ హార్బ‌ర్ క‌డుతున్నాం అని, ఇది పూర్త‌యితే ఇక‌పై మ‌త్స్య‌కారులు ప‌నుల నిమిత్తం, ఉపాధి నిమిత్తం, వేట నిమిత్తం ఇక‌పై గుజ‌రాత్ కు పోవాల్సిన ప‌నే ఉండ‌ద‌ని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.