కలెక్టరేట్ : జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ పేర్కొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఆధ్వర్యాన జరుగుతున్న ఇంటర్మీడియా స్పోర్ట్సు మీట్ క్రికెట్ ఫైనల్స్ విజేతలకు ఆయన ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా సేవలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ముఖ్య మంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.