స్థల విక్రయంలో తనకు రావాల్సిన కమీషన్‌ ఇవ్వలేదని అక్కసు పెంచుకున్న ఓ వ్యక్తి వరుసకు మేనమామ అయిన బిల్డర్‌పై వేట కొడవలితో దాడి చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్‌కు చెందిన బిల్డర్‌ రెడ్డిగారి రవీందర్‌రెడ్డి బేగంపేటలో ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్‌ కొనుగోలులో రవీందర్‌రెడ్డి అల్లుడు గౌని మోహన్‌రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించాడు.

కమీషన్‌ కింద మోహన్‌రెడ్డికి రూ. 6 లక్షల కమీషన్‌ రావాలి. అయితే ఎన్నిసార్లు అడిగినా రవీందర్‌రెడ్డి స్పందించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్‌రెడ్డి ..రవీందర్‌రెడ్డిని అంతం చేయాలని పథకం వేశాడు.యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న మోహన్‌రెడ్డి తన మామను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాడు. కూకట్‌పల్లిలో ఓ కత్తిని తయారు చేయించి ఆ కత్తిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌కు వచ్చి రవీందర్‌రెడ్డి నివసించే అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కత్తితో మాటు వేశాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.