హైదరాబాద్‌: వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులు టికెట్‌ రీఫండ్‌ కోసం ఇక రిజర్వేషన్‌ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ రీఫండ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా రీఫండ్‌ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్‌ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల్లో టికెట్‌ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్‌ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్‌ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్‌ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్‌ టికెట్లకు సైతం ఆన్‌లైన్‌ రీఫండ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది.

By admin

Leave a Reply

Your email address will not be published.