ఆముదాలవలస : పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరు అద్భుతంగా ఉన్నదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.మంగళవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డ్ లో లక్ష్మి నగర్ వీది లో నిన్న సందర్శించగా మిగిలి ఉన్న భాగం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన సంబంధిత అధికారులు,పట్టణ వైయ‌స్ఆర్‌ సీపీ క్యాడర్ తో పాటు పాల్గొన్నారు.ప్రజల అవసరాలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం విషయంలో గుర్తెరిగి వాటిని అమలు చేస్తూ మనసెరిగిన నేతగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సేవలందిస్తున్నారని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ సందర్శించిన స్పీకర్… సీఎం వైయ‌స్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన లబ్దిదారులకు అందుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు.సమయానికి వృద్దులకు,వితంతువులకు పింఛన్ లు అందుతున్నాయా అని పలువురు వృద్దులను,వితంతువులను అడిగి తెలుసుకున్నారు.జగనన్న దయతో సమయానికే వాలంటీర్లు తీసుకు వచ్చి అందజేస్తున్నారని వారు బదులిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేని వారు,సంబందిత సచివాలయం అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్పీకర్ దృష్టికి వచ్చిన పలు సమస్యలను అక్కడే ఉన్న అధికారులుతో చర్చించి పరిష్కారం అయ్యేలా చొరవ చూపారు.మున్సిపాలిటీ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు కు సంబంధించిన పూర్తి వివరాలను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన వివరించారు. వైయ‌స్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైయ‌స్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వైయ‌స్సార్ చేయూత, వైయ‌స్సార్ ఆసరా తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగిందనే విషయాన్ని స్పీకర్ తమ్మినేని వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.